హైద్రాబాదీ మార్లిన్ మన్రో అశ్వినిశ్రీ
on Jul 22, 2025
బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా వెలుగులోకి వచ్చింది అశ్వినిశ్రీ. ఈమె ఒక బ్యూటీ ఆటం బాంబు. ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో ఆమె పెట్టే రీల్స్ మాములుగా ఉండవు. ఇక చెమటలు పట్టిస్తూ పోస్ట్ చేసే జిమ్ వీడియోస్ ఐతే వేరే లెవెల్. అలాగే రీసెంట్ గా ఒక చిన్న బ్లాక్ గౌన్ వేసుకుని చేతులకు ఎర్రటి గోరింటాకు పెట్టుకుని నవ్వుతూ తుళ్ళుతూ చేసిన రీల్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియోని తీసింది ఆమె సిస్టర్ అనుకుంటా హైద్రాబాదీ మార్లిన్ మన్రో అశ్వినిశ్రీ అంటూ తనకు తానె బిరుదు ఇచ్చేసుకుని పోస్ట్ పెట్టింది. "పరువం వానగా" అనే సాంగ్ మ్యూజిక్ ని బ్యాక్ గ్రౌండ్ గ పెట్టుకుంది. ఇక ఈమె కొన్ని మూవీస్ లో నటించింది. వరంగల్ నిట్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. నటన అంటే చాలా ఇష్టంతో ఆమె ఈ రంగంలోకి వచ్చింది.
అలాగే సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో ఫాలోవర్స్ ని పెంచుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్, రవితేజ రాజా ది గ్రేట్, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ వంటి మూవీస్ లో చిన్న చిన్న రోల్స్ లో నటించింది. ఇక ఈమె స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ పెడుతూ ఉంటుంది. ఈమె రీసెంట్ గా తన బర్త్ డేని అనాధ పిల్లల మధ్యన సెలెబ్రేట్ చేసుకుంది. అలాగే ఆదితో కలిసి ఢీ షోకి మెంటార్ గా వచ్చింది. ఆది వేసే జోక్స్ కి పడీ పడీ నవ్వేది. అలాగే బుల్లితెర మీద షోస్ లో కనిపిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
